వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా సీతానగరం మండలంలో ఆటో, వ్యాన్ ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు. దైవ దర్శనానికి వెళ్తున్న భక్తుల ఆటోను ఎదురుగా వచ్చిన వ్యాన్ ఢీకొట్టినట్లు పోలీసులు తెలిపారు.
వ్యాన్ డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Comments
Loading comments...

