Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫ్రాన్స్‌లో కుప్పకూలిన స్కైడైవింగ్ విమానం.. 11 మంది మృతి

రూప దేవి Jun 28, 2026 2:40 PM అల్ ఇండియా 7 viewsabout 1 hour ago
ఫ్రాన్స్‌లో కుప్పకూలిన స్కైడైవింగ్ విమానం.. 11 మంది మృతి - Udayam Digital
తూర్పు ఫ్రాన్స్‌లోని నాన్సీ నగరం సమీపంలో గల టోంబ్లైన్ ప్రాంతంలో ఒక సివిల్ విమానం కూలిపోయిన ఘోర ప్రమాదంలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. నాన్సీ-ఎషే విమానాశ్రయం నుండి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే ఈ ప్రమాదం జరిగింది. మృతులలో పైలట్‌తో పాటు ఐదుగురు స్కైడైవింగ్ ఇన్‌స్ట్రక్టర్లు (శిక్షకులు), ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. వీరంతా ఒక స్కైడైవింగ్ క్లబ్‌కు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. రన్వేకు సమీపంలోని పచ్చిక ప్రాంతంలో విమానం నిలువుగా కూలిపోయిందని, ప్రమాదానికి గల సాంకేతిక కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని స్థానిక అధికారులు వెల్లడించారు.

Comments

G
Loading comments...