Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

స్కూటీలు ఢీకొని ముగ్గురికి గాయాలు

Follow Udayam on Google
B RAJESH Sep 03, 2026 8:48 PM విజయనగరంGeneral
రామభద్రపురం స్మార్ట్ సిటీ వద్ద రెండు స్కూటీలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. రామభద్రపురంలో ఫంక్షన్కు వచ్చి పార్వతీపురం వెళ్తున్న ఇద్దరు యువకుల స్కూటీ, పారాది పోస్టాఫీసులో విధులు ముగించుకుని సాలూరు వెళ్తున్న మహిళ స్కూటీ బలంగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో యువకులిద్దరి ముఖాలకు, మహిళ కాలికి గాయాలయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

Comments

G
Loading comments...