Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సితాయిపేట్ గుడితాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
సురేందర్ రిపోర్టర్ ✍️ Sep 11, 2026 6:52 PM నిజామాబాద్General
సితాయిపేట్ గుడితాండలో డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ - Udayam
ధర్పల్లి మండలంలోని సితాయిపేట్ గుడితాండ గ్రామంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ సర్పంచ్ సరస్వతి రమేష్ నాయక్ ఆధ్వర్యంలో లబ్ధిదారులకు నూతన డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సభావత్ మోహన్ నాయక్, పంచాయతీ కార్యదర్శి కుంట ప్రవీణ్ కుమార్, వార్డు సభ్యులు, తాండ పెద్దమనుషులు, యువకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...