వార్తలకు తిరిగి వెళ్లండి
సిరిసిల్ల వెంకంపేటలో ఆదివారం రాత్రి ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. కర్రలతో పరస్పరం దాడులకు దిగడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ వర్గానికి చెందిన తండ్రి, కొడుకులిద్దరూ గాయపడ్డారు. పద్మశాలి యువజన సంఘం ఎన్నికల్లో పోటీ చేసిన యువకుల మధ్య పాత విభేదాలే ఘర్షణకు కారణమని తెలుస్తోంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.
గాయపడిన వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

