వార్తలకు తిరిగి వెళ్లండి

వేములవాడ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈవీఎంలను గురువారం సిరిసిల్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి సర్దాపూర్లోని ఈవీఎం గోదాంలోకి తరలించారు. కోర్టు కేసు ముగియడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం అనుమతుల మేరకు ఈ ప్రక్రియ చేపట్టారు.
సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగ్రవాల్ తరలింపు ప్రక్రియను పరిశీలించారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో, పోలీసు బందోబస్తు మధ్య ఈవీఎంలను గోదాంలో భద్రపరిచారు.
Comments
Loading comments...

