వార్తలకు తిరిగి వెళ్లండి

సిర్గాపూర్ ZPHS కేంద్రంలో పాఠశాల స్థాయి బాహ్య మూల్యాంకనం గురువారం ఐదో రోజు కొనసాగింది. 6వ తరగతి సామాన్య శాస్త్రానికి సంబంధించిన 157, 9వ తరగతి తెలుగు 197 జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తయింది.
మూల్యాంకన కేంద్రాన్ని MEO శ్రీనివాస్ పరిశీలించారు. తెలుగు ముఖ్య పరీక్షకుడిగా నాగభూషణం, సైన్స్ ముఖ్య పరీక్షకుడిగా మధుకర్ రెడ్డి, సహాయక క్యాంప్ అధికారిగా ఇన్‌ఛార్జ్ హెచ్‌ఎం లక్ష్మణ్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

