Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సినిమాకు ప్రాంతాల హద్దులు లేవు: నరేశ్‌

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 9:55 AM జాతీయంవినోదం
సినిమాకు ప్రాంతాల హద్దులు లేవు: నరేశ్‌ - Udayam
‘తెలంగాణ సినిమా’, ‘రాయలసీమ సినిమా’ అని వేరు చేయడం ఈ మధ్య ఫ్యాషన్‌ అయిపోయిందని నటుడు నరేశ్‌ అన్నారు. సంగీతానికే కాదు.. సినిమాకు కూడా హద్దులు ఉండవని పేర్కొన్నారు. ‘గరివిడి లక్ష్మి’ ట్రైలర్‌ లాంచ్‌ కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. గౌరీ నాయుడు జమ్ము దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Comments

G
Loading comments...