వార్తలకు తిరిగి వెళ్లండి

సింహాచలం శ్రీ వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సహస్రనామ అర్చన నేత్రపర్వంగా సాగింది. ఆర్జిత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్ఠింపజేశారు. భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్రాగమ శాస్త్ర విధానంలో అర్చన నిర్వహించారు.
మంత్రపుష్పం, మంగళాశాసనాల అనంతరం భక్తులకు వేదాశీర్వచనాలు, శేషవస్త్రాలు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు.
Comments
Loading comments...

