వార్తలకు తిరిగి వెళ్లండి

రాయికల్ మండలం కుమ్మరిపల్లె ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు కడకుంట్ల అభయ్ రాజ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న విదేశీ విద్యా అధ్యయన పర్యటనకు ఎంపికయ్యారు. సెప్టెంబర్ 19 నుంచి 26 వరకు సింగపూర్లో పర్యటించి అక్కడి ఉత్తమ బోధనా విధానాలను పరిశీలించనున్నారు.
అనంతరం ప్రభుత్వానికి అక్కడి బోధన విధానాలపై నివేదిక సమర్పించనున్నారు. ఎంపికైన అభయ్ రాజ్ ను మండల ఉపాధ్యాయులు, వివిధ యూనియన్ సంఘాల సభ్యులు అభినందించారు.
Comments
Loading comments...

