Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగూర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం

Follow Udayam on Google
Harika Aug 20, 2026 3:17 PM సంగారెడ్డిGeneral
సింగూర్‌కు కొనసాగుతున్న వరద ప్రవాహం - Udayam
సింగూర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం కొనసాగుతోంది. గురువారం ఉదయం 6 గంటల వరకు 24 గంటల సగటు వివరాల ప్రకారం ప్రాజెక్టు నీటిమట్టం 515.380 మీటర్లుగా నమోదైంది. నీటి నిల్వ 4.456 టీఎంసీలుగా ఉంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 523.600 మీటర్లు కాగా, సగటున 681 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. దిగువకు 380 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.

Comments

G
Loading comments...