వార్తలకు తిరిగి వెళ్లండి

సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల సందడి మొదలైంది. గుర్తింపు సంఘంగా నిలిచేందుకు వివిధ కార్మిక సంఘాలు వ్యూహాలు సిద్ధం చేసుకుంటున్నాయి. సెప్టెంబర్ 8తో ప్రస్తుత గుర్తింపు సంఘం రెండేళ్ల పదవీకాలం ముగియనుంది.
దీంతో ఎన్నికల నిర్వహణపై కార్మిక వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఆర్‌ఎల్‌సీ, సింగరేణి యాజమాన్యం ఎన్నికల షెడ్యూల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటాయోనని కార్మిక సంఘాలు ఎదురుచూస్తున్నాయి.
Comments
Loading comments...

