Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సింగారాపువీధిలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం

Follow Udayam on Google
B RAJESH Sep 09, 2026 8:03 PM విజయనగరంGeneral
సింగారాపువీధిలో అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం - Udayam
బొబ్బిలి పట్టణంలోని సింగారాపువీధిలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా ఉంది. మురుగునీటి కాలువలో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు రోడ్డుపైకి వస్తుంది. చెత్త రోడ్డుకు శివారులో వేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మురుగునీరు, చెత్తతో దుర్వాసన, దోమలు బెడదతో ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. కాలువ శుభ్రం చేయాలని, చెత్త సేకరణ సక్రమంగా చేయాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.

Comments

G
Loading comments...