Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీతంపేటలో పాఠశాల ఎదుట ప్రమాదకర గుంత.. పట్టించుకునే వారేరీ

Follow Udayam on Google
B Ganga Sep 08, 2026 7:25 PM పార్వతీపురం మన్యంGeneral
సీతంపేటలో పాఠశాల ఎదుట ప్రమాదకర గుంత.. పట్టించుకునే వారేరీ - Udayam
సీతంపేటలోని ప్రభుత్వ గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల ఎదురుగా ప్రధాన రహదారిపై పెద్ద గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. గుంతలో రాళ్లు, మట్టి పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాలకు విద్యార్థులు రాకపోకలు సాగించే ప్రాంతం కావడంతో ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి గుంతను పూడ్చే చర్య చేపట్టాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...