వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ రద్దు చేయాలని కోరుతూ సెప్టెంబర్ 1న విజయవాడలో జరగనున్న మహాధర్నాను జయప్రదం చేయాలని ఏపీ సీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.పైడిపునాయుడు, రాష్ట్ర నాయకుడు జి.శ్రీను కోరారు. బొబ్బిలి ఎన్టీవో హోమ్ మంగళవారం మహాధర్నా పోస్టర్లను విడుదల చేశారు.
సీపీఎస్ రద్దు కోసం జరగనున్న మహాధర్నాకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు తరలి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

