Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగుల నిరసన

Follow Udayam on Google
RR REDDY Sep 01, 2026 2:53 PM నిజామాబాద్General
సీపీఎస్ రద్దు చేయాలని ఉద్యోగుల నిరసన - Udayam
సెప్టెంబర్ 1న పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ మండల ప్రజా పరిషత్ ధర్పల్లి ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. రాష్ట్ర ఉద్యోగ సంఘం పిలుపు మేరకు మధ్యాహ్న భోజన విరామ సమయంలో మండల కార్యాలయం ఎదుట ఈ కార్యక్రమం నిర్వహించారు. సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...