వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధులపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా వ్యవహరించాలని జన్నారం మండలంలోని కళామడుగు గ్రామ పల్లె దవఖాన వైద్యురాలు డాక్టర్ గంగాదేవి సూచించారు. మంగళవారం జన్నారం మండలంలోని మురిమడుగు, సోమ గూడెం గ్రామాలలో సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు.
అలాగే గర్భవతులు, బాలింతలను పరీక్షించి పౌష్టికాహారం తీసుకోవాలని, 30 సంవత్సరాల నిండిన ప్రతి ఒక్కరూ బిపి, షుగర్ పరీక్షలు చేయించుకుని మందులను వాడాలని ఆమె సూచించారు.
Comments
Loading comments...

