Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘సిగ్మా’.. మూడో రోజూ అదే జోరు

Follow Udayam on Google
Sai Nath Oct 05, 2026 12:34 PM జాతీయంవినోదం
‘సిగ్మా’.. మూడో రోజూ అదే జోరు - Udayam
సందీప్‌ కిషన్‌ నటించిన ‘సిగ్మా’ ఓపెనింగ్‌ వీకెండ్‌లో స్థిరమైన వసూళ్లు సాధించింది. ఆదివారం రూ.1.70 కోట్ల గ్రాస్‌ రాబట్టడంతో.. మూడు రోజుల్లో దేశీయ వసూళ్లు రూ.6.10 కోట్లకు చేరాయి. 1,753 షోలతో 23.6 శాతం ఆక్యుపెన్సీ నమోదైంది. తమిళనాడు ఈ చిత్రానికి ప్రధాన మార్కెట్‌గా నిలిచింది. మూడు రోజుల్లో అక్కడ రూ.3.15 కోట్లు వసూలయ్యాయి. ఏపీ, తెలంగాణ నుంచి రూ.2.18 కోట్లు, కర్ణాటక నుంచి రూ.47 లక్షలు వచ్చాయి

Comments

G
Loading comments...