Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి

Follow Udayam on Google
శివ కుమార్ Jun 23, 2026 5:51 PM తిరుపతిGeneral
శ్యామ్ ప్రసాద్ ముఖర్జీకి ఘన నివాళి - Udayam
శ్రీకాళహస్తిలో బీజేపీ ఆధ్వర్యంలో డాక్టర్ శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ బలిదాన దివస్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, దేశ సమగ్రత కోసం ఆయన చేసిన పోరాటాన్ని కొనియాడారు. 'ఒకే దేశం, ఒకే చట్టం' అని నినదించిన మహనీయుడని, ఆర్టికల్ 370 రద్దు కోసం ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...