Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

జొన్నగిరిలో బంగారు గనుల ప్రాజెక్టు ప్రారంభం

Follow Udayam on Google
కృష్ణ మూర్తి Jun 23, 2026 6:35 PM కర్నూలుGeneral
జొన్నగిరిలో బంగారు గనుల ప్రాజెక్టు ప్రారంభం - Udayam
కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో రూ.405 కోట్లతో నిర్మించిన బంగారు గనుల ప్రాజెక్టును రేపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించనున్నారు. జియో మైసూర్ సర్వీసెస్, డెక్కన్ గోల్డ్ మైన్స్ సంస్థలు చేపట్టిన ఈ ప్రాజెక్టులో రెండో యూనిట్‌కు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు హంద్రీ-నీవా ప్రాజెక్టు నుంచి 18 కిలోమీటర్ల పైప్‌లైన్ ద్వారా నీటిని సరఫరా చేస్తారు. రాష్ట్రంలోనే కీలకమైన ఈ మైనింగ్ ప్రాజెక్టు ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరగనున్నాయి.

Comments

G
Loading comments...