శవపరీక్ష కోసం బాధితుల నరకయాతన

మర్రిగూడ మండల సామాజిక ఆరోగ్య కేంద్రంలో పోస్టుమార్టం సౌకర్యాలు, సిబ్బంది లేకపోవడంతో మృతుల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. శవపరీక్ష కోసం సుమారు 60 కిలోమీటర్ల దూరంలోని జిల్లా కేంద్రం లేదా దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి మృతదేహాలను తీసుకెళ్లాల్సి రావడంతో సమయం, వ్యయం భారంగా మారుతోంది.
స్థానిక సీహెచ్‌సీలో అంబులెన్స్ సౌకర్యం కూడా లేకపోవడంతో ప్రైవేటు వాహనాలకు వేల రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది.
Comments
Loading comments...
