వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్తకోట మండలం పామాపురంలోని భ్రమరాంబ సహిత రామేశ్వరస్వామి ఆలయం శతాబ్దాల చరిత్రకు ప్రసిద్ధి. క్రీ.శ. 550-750 మధ్య కాలంలో ఆలయాన్ని నిర్మించినట్లు చెబుతారు. ఊకచెట్టు వాగు మధ్యలో శివుడి విగ్రహం ఆకట్టుకుంటుంది.
ఇక్కడి శివలింగం కాశీ జ్యోతిర్లింగాన్ని పోలి ఉంటుందని భక్తుల విశ్వాసం. ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మండపం, జంటనాగుల మందిరం ఉన్నాయి.
Comments
Loading comments...

