వార్తలకు తిరిగి వెళ్లండి

మేత ధరల పెరుగుదల, మార్కెట్‌లో ధరల క్షీణతతో ఇప్పటికే సతమతమవుతున్న ఆక్వా రైతులను 'వైట్‌గట్' వ్యాధి మరింత కోలుకోలేని దెబ్బతీస్తోంది. ఈ సమస్య కారణంగా దిగుబడులు దారుణంగా పడిపోతుండటంతో, రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో తక్కువ కౌంట్‌కే రొయ్యల పట్టుబడులు (హార్వెస్టింగ్) జరపాల్సి వస్తోంది.
కర్లపాలేనికి చెందిన రైతు శ్రీనివాసరావు పాండిచ్చేరి హేచరీ నుంచి రూ.1.25 లక్షల ఖర్చుతో తెచ్చిన లక్ష టైగర్ రొయ్య పిల్లల్లో కేవలం 45 వేలు మాత్రమే బతికాయి. నష్టపోయిన రైతు ఫిర్యాదుపై హేచరీ ప్రతినిధులు స్పందించకపోగా, పొరుగు రాష్ట్ర హేచరీలపై చర్యలు తీసుకునే అధికారం తమకు లేదంటూ మత్స్యశాఖ అధికారులు చేతులెత్తేయడం సాగుదారుల దయనీయ స్థితికి అద్దం పడుతోంది.
Comments
Loading comments...

