వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం జిల్లాలోని సాయిబాబా ఆలయాల్లో గురు పౌర్ణమి వేడుకలు బుధవారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో బాబాకు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజలు చేసి విశేషంగా అలంకరించారు.
ఉదయం నుంచే భక్తులు ఆలయాలకు పోటెత్తి దీపాలు వెలిగించి, పాలాభిషేకాలు చేశారు. ఆలయాలు భక్తులతో కిక్కిరిసిపోగా, సాయిబాబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ వేడుకలు సాగాయి.
Comments
Loading comments...
