Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీవారి భక్తులకు మర్యాద ఇవ్వాలి

Follow Udayam on Google
Anuroop Oct 05, 2026 3:57 PM తిరుపతిGeneral
శ్రీవారి భక్తులకు మర్యాద ఇవ్వాలి - Udayam
తిరుమల శ్రీవారి భక్తుల పట్ల మర్యాదగా ప్రవర్తించి, ఆత్మీయంగా మాట్లాడాలని సైకాలజిస్ట్ ఎన్‌బీ సుధాకర్ రెడ్డి సూచించారు. సోమవారం శ్వేత భవనంలో టీటీడీ ఉద్యోగులకు సత్ప్రవర్తన, మృదు భాషణంపై శిక్షణ ఇచ్చారు. భక్తులు అసహనం, కోపం ప్రదర్శించినప్పుడు సహానుభూతితో వారి పరిస్థితిని అర్థం చేసుకుని ఆదరించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సేదతీర్చి, దేవుని దర్శనం చేయించి పంపాలని చెప్పారు.

Comments

G
Loading comments...