Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాంత్ చారికి నివాళి అర్పించిన విశ్వకర్మ మహాసభ నాయకులు

Follow Udayam on Google
p.g.murthy Aug 15, 2026 11:10 AM మంచిర్యాలGeneral
శ్రీకాంత్ చారికి నివాళి అర్పించిన విశ్వకర్మ మహాసభ నాయకులు - Udayam
తెలంగాణ రాష్ట్ర కోసం అమరుడైన శ్రీకాంత్ చారికి విశ్వకర్మ మహాసభ నాయకులు నివాళి అర్పించారు. శ్రీకాంత్ చారి జయంతిని పురస్కరించుకొని శనివారం జన్నారం మండల కేంద్రంలో వారు శ్రీకాంత్ చారి చిత్రపటానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్రం కోసం శ్రీకాంత్ చారి ఆత్మబలిదానం చేసుకున్నారని అన్నారు. అమరవీరుల త్యాగాలను అందరూ స్మరించుకోవాలని విశ్వకర్మ మహాసభ అధ్యక్షులు శ్రీరాముల గంగాధర్ కోరారు.

Comments

G
Loading comments...