Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం నగర అభివృద్ధికి రూ.39 కోట్లు నిధులు మంజూరు

Follow Udayam on Google
RAGHU Aug 21, 2026 11:23 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం నగర అభివృద్ధికి రూ.39 కోట్లు నిధులు మంజూరు - Udayam
శ్రీకాకుళం నగర అభివృద్ధి, సుందరీకరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.39 కోట్లు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే గొండు శంకర్‌ శుక్రవారం తెలిపారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు చొరవతో మంత్రి నారాయణ నిధులు మంజూరు చేసినట్లు చెప్పారు. పార్కుల పునరుద్ధరణ, డ్రైనేజీ, రోడ్ల విస్తరణ, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, కూడళ్ల అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. త్వరలో టెండర్లు పిలుస్తామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...