Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళం : భోగాపురంతో శ్రీకూర్మం మరింత చేరువ

Follow Udayam on Google
RAGHU Jul 28, 2026 10:14 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళం : భోగాపురంతో శ్రీకూర్మం మరింత చేరువ - Udayam
శ్రీకూర్మం : భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అందుబాటులోకి రానుండటంతో శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకూర్మానికి ఆధ్యాత్మిక పర్యాటక రంగంలో అంతర్జాతీయ గుర్తింపు లభించే అవకాశాలు మెరుగుపడనున్నాయని జిల్లా పర్యాటక శాఖ అధికారి నారాయణరావు తెలిపారు. మంగళవారం శ్రీకూర్మం ఆలయ ఆవరణలో నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఆయన మాట్లాడుతూ...భోగాపురం విమానాశ్రయం ప్రారంభమైన అనంతరం విశాఖపట్నం విమానాశ్రయంతో పోలిస్తే శ్రీకూర్మానికి చేరుకోవడం మరింత సులభతరం అవుతుందని పేర్కొన్నారు. దీంతో దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉందన్నారు. విమానాశ్రయం అందుబాటులోకి రావడం ద్వారా శ్రీకూర్మం క్షేత్రానికి ఆధ్యాత్మిక పర్యాటక ప్రాధాన్యం మరింత పెరుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Comments

G
Loading comments...