Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీకాకుళాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ

Follow Udayam on Google
RAGHU SKLM Sep 11, 2026 6:23 PM శ్రీకాకుళంGeneral
శ్రీకాకుళాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలి: సీపీఐ - Udayam
జిల్లాలో నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాను తక్షణమే కరువు ప్రాంతంగా ప్రకటించి రైతులు, కౌలు రైతులు, వ్యవసాయ కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ డిమాండ్ చేశారు. కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన చేపట్టి ఆయన మాట్లాడారు. పంటలు సాగు కాక వ్యవసాయ రంగం సంక్షోభంలో ఉందని, ఉపాధి లేక కార్మికులు వలసలు వెళ్తున్నారని తెలిపారు.

Comments

G
Loading comments...