వార్తలకు తిరిగి వెళ్లండి
గూడూరు రెండో పట్టణం నర్సింగరావుపేటలో వెలసి ఉన్న శ్రీ కోదండ రామాంజనేయ స్వామి ఆలయంలో శనివారం స్వామివారికి పంచామృత అభిషేకం నిర్వహించారు. వివిధ రకాల పంచామృతాలను కలిపి స్వామివారికి అభిషేకం చేసి స్వామివారిని విశేషంగా అలంకరించారు.
ఆలయ అర్చకులు యోగిస్వామి వారిని పట్టు వస్త్రాలతో అలంకరించారు .భక్తులు పెద్ద సంఖ్యలో ఈ వేడుకల్లో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
Comments
Loading comments...

