Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేటి నుంచి గండి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు

Follow Udayam on Google
రాజశేఖర్ రావు Aug 13, 2026 10:45 AM అన్నమయ్యGeneral
నేటి నుంచి గండి ఆలయంలో శ్రావణమాస ఉత్సవాలు - Udayam
జిల్లాలో ప్రసిద్ధ గండి వీరాంజనేయస్వామి ఆలయంలో నేటి నుంచి శ్రావణమాస ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ప్రతిరోజూ ఉదయం 4 నుంచి 4.30 వరకు అభిషేకం, 4.30 నుంచి 5 వరకు అలంకరణ, 5.30 నుంచి మధ్యాహ్నం 12 వరకు సర్వదర్శనం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 12.30కి మహానైవేద్యం, మంగళహారతి అనంతరం స్వామివారి దర్శనాలు ఉంటాయని ఛైర్మన్‌ వెంకటస్వామి, ఈవో విశ్వనాథ్‌ తెలిపారు. భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు.

Comments

G
Loading comments...