Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కోటిలింగాలలో శ్రావణ సందడి

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Aug 16, 2026 2:59 PM కరీంనగర్తెలంగాణ
కోటిలింగాలలో శ్రావణ సందడి - Udayam
పవిత్ర గోదావరి తీరంలోని ప్రాచీన శైవక్షేత్రం కోటిలింగాలలో శ్రావణ మాసం సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. ఆదివారం సెలవు కావడంతో అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరించారు. భక్తులు గంగాదేవికి మొక్కులు చెల్లించుకుని, నదీ తీరంలోని శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో స్వామివారిని సేవించారు.

Comments

G
Loading comments...