వార్తలకు తిరిగి వెళ్లండి
సచివాలయాల్లో పేపర్ల కొరత - ప్రజల అవస్థలు

రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, మీ-సేవ కేంద్రాల్లో పది రోజులుగా హై సెక్యూరిటీ పేపర్లు నిలిచిపోయాయి. దీనివల్ల వన్-బీ, అడంగల్ వంటి ధ్రువీకరణ పత్రాలు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా పింఛన్ల కోసం కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు అవసరమైన వారు సచివాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఈ సమస్యను గుర్తించి, అధికారులు వెంటనే హై సెక్యూరిటీ పేపర్లను అందుబాటులోకి తెచ్చి ప్రజల ఇబ్బందులను తొలగించాలని కోరుతున్నారు.
Comments
Loading comments...