వార్తలకు తిరిగి వెళ్లండి

దుద్యాల మండలం హకీంపేట రైతు వేదికలో శంషాబాద్-కోస్గి రేడియల్ రోడ్డు భూసేకరణపై తాండూరు ఆర్డీఓ అనిత ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పోలేపల్లికి చెందిన 42 మంది రైతులు 53 ఎకరాల భూమితో పాటు నిర్మాణాలు, బోర్లను కోల్పోతున్నట్లు గుర్తించారు.
బాధితులకు తగిన పరిహారం అందించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీఓ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కిషన్ నాయక్, రైతులు పాల్గొన్నారు
Comments
Loading comments...

