Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శిథిలావస్థకు భద్రగిరి ఐటీఐ వసతి గృహం

Follow Udayam on Google
B RAJESH Aug 19, 2026 11:22 PM విజయనగరంGeneral
శిథిలావస్థకు భద్రగిరి ఐటీఐ వసతి గృహం - Udayam
గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని భద్రగిరి ఐటీఐ వసతి గృహం శిథిలావస్థకు చేరి క్రిమి కీటకాలు, విషసర్పాలకు నిలయంగా మారింది. దూర ప్రాంతాల నుంచి వచ్చి ఐటీఐ చదివే విద్యార్థుల కోసం అప్పట్లో భోజన వసతి ఉండేది. తర్వాత హాస్టల్ ఎత్తివేయగా, కొంతకాలం విద్యార్థులు వండుకొని ఉన్నారు. ప్రస్తుతం ఎవరూ లేకపోవడంతో ఈ ప్రాంగణం పిచ్చి మొక్కలతో వెలవెలబోతోంది.

Comments

G
Loading comments...