వార్తలకు తిరిగి వెళ్లండి

కలెక్టరేట్ సమీపంలోని శిశు విహార్‌నుచిత్తూరు జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్ సుమిత్ కుమార్ గురువారం సందర్శించి సౌకర్యాలు, పిల్లల సంరక్షణను పరిశీలించారు. దత్తత రికార్డులు, మిషన్ వాత్సల్య పోర్టల్‌లోని వివరాలను తనిఖీ చేశారు.
కాంపౌండ్ వాల్ ఎత్తు పెంపు, ఇనుప గ్రిల్ ఏర్పాటు వంటి పనులను తక్షణమే చేయాలని ఆదేశించారు. పిల్లల ఆరోగ్య పరీక్షలకు పీడియాట్రిషియన్‌ను ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు.
Comments
Loading comments...

