వార్తలకు తిరిగి వెళ్లండి

కేరళలో షిగెల్లా వ్యాధి తీవ్ర రూపం దాల్చింది. ఈ ప్రమాదకర బ్యాక్టీరియా వల్ల ఇద్దరు చిన్నారులు మరణించగా, రాష్ట్రవ్యాప్తంగా 85కు పైగా కేసులు నమోదయ్యాయి. ముఖ్యంగా కోజికోడ్, వయనాడ్ వంటి జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉండటంతో ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించింది.
కలుషిత నీరు, ఆహారం ద్వారా ఈ వ్యాధి వేగంగా వ్యాపిస్తోంది. ఆరోగ్య శాఖ అప్రమత్తమై నిఘాను ముమ్మరం చేసింది. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

