వార్తలకు తిరిగి వెళ్లండి

హైదరాబాద్ ధర్నా చౌక్‌లో నాగల్‌గిద్ద మండల పీఆర్‌టీయూ ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా అధ్యక్షులు శేరికర్ రమేష్ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని కోరారు.
సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని, పెండింగ్ బిల్లులు చెల్లించాలని, 317 జీవో సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
Comments
Loading comments...

