Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్

Follow Udayam on Google
Priya Singh Jun 09, 2026 11:18 AM హైదరాబాద్General
శంషాబాద్‌లో విమానం అత్యవసర ల్యాండింగ్ - Udayam
కొచ్చిన్ నుండి ఢిల్లీ వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు మహిళలు తీవ్రమైన కడుపు నొప్పితో అస్వస్థతకు గురయ్యారు. ప్రయాణికుల ప్రాణాలను కాపాడేందుకు పైలట్లు అప్రమత్తమై విమానాన్ని శంషాబాద్ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు. విమానం ల్యాండ్ అయిన వెంటనే, వైద్య సిబ్బంది సదరు మహిళలకు ప్రథమ చికిత్స అందించి, తదుపరి చికిత్స నిమిత్తం వారిని అపోలో ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

Comments

G
Loading comments...