Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు

దివ్య శ్రీ Jul 16, 2026 10:55 AM వరంగల్ 4 viewsabout 2 hours ago
భద్రకాళి ఆలయంలో శాకంబరీ ఉత్సవాలు - Udayam Digital
వరంగల్‌లోని ప్రసిద్ధ శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకంబరీ మహోత్సవాలు రెండోరోజు ఘనంగా కొనసాగుతున్నాయి. గురువారం ఉదయం వేదపండితులు, అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, హోమాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారిని కపాలిని క్రమంలో, సాయంత్రం భగమాలిని క్రమంలో విశేషంగా అలంకరించి పూజలు చేయనున్నారు. ఈ వేడుకలను చూసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

Comments

G
Loading comments...