Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

షాబాద్ ఎస్సైపై సస్పెన్షన్

Follow Udayam on Google
భరత్ తేజ Jul 12, 2026 7:22 AM హైదరాబాద్General
షాబాద్ ఎస్సైపై సస్పెన్షన్ - Udayam
షాబాద్ వరుస హత్యల ఘటనలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎస్సై రమేశ్‌ను ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి సస్పెండ్ చేశారు. నిందితుడు రాజ్‌కుమార్ బెదిరింపులపై బాధిత కుటుంబం పలుమార్లు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపిస్తూ స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. పోక్సో కేసు నమోదైనా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే అతడు ఆరుగురిని దారుణంగా హత్య చేశాడని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై పోలీస్ ఉన్నతాధికారులు పూర్తి వివరాలు సేకరిస్తున్నారు.

Comments

G
Loading comments...