Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు తగవు: కొప్పుల ఈశ్వర్

Follow Udayam on Google
రాజేష్ కుమార్ Jul 12, 2026 12:32 PM కరీంనగర్General
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాజకీయాలు తగవు: కొప్పుల ఈశ్వర్ - Udayam
లక్షల ఎకరాలకు సాగునీరు అందించే కాళేశ్వరం ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్రంగా మండిపడ్డారు. కరీంనగర్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కన్నెపల్లి పంప్‌హౌస్ నుంచి నీటిని ఎత్తిపోయాలని సలహా ఇచ్చిన రిటైర్డ్ ఇంజనీర్లను జైలుకు పంపుతామనడం సీఎం అహంకారానికి నిదర్శనమన్నారు. సీఎం తక్షణమే వారికి క్షమాపణలు చెప్పాలన్నారు. రైతులు కన్నెపల్లి పంపులను ఆన్ చేయకముందే, ప్రభుత్వమే పంపులు ఆన్ చేసి రిజర్వాయర్లను నింపాలని, ఈ సున్నితమైన విషయంలో రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...