వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా పెబ్బేరుకు చెందిన కార్తీక్ (20), సంతోష్ శనివారం అర్ధరాత్రి బైక్‌పై అల్లంపూర్ వెళ్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పుల్లూరు టోల్‌ప్లాజా సమీపంలో వీరి బైక్ అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో కార్తీక్ తలకు తీవ్ర గాయాలు కావడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన వెంటనే సంతోష్ మరో వాహనంలో స్వస్థలానికి చేరుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని, మృతదేహాన్ని పంచనామా నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యువకుడి మరణంతో స్థానికంగా విషాదం అలుముకుంది.
Comments
Loading comments...

