Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ లో ఘనంగా ‘తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్’

Follow Udayam on Google
సందీప్ Jul 12, 2026 11:11 AM నిర్మల్ General
నిర్మల్ లో ఘనంగా ‘తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్’ - Udayam
తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాలు, జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో శనివారం పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ‘తెలంగాణ స్పోర్ట్స్ నాలెడ్జ్ ఆన్ వీల్స్’ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు, కోచ్‌లకు ఆధునిక శిక్షణా విధానాలు, ఫిట్‌నెస్, స్పోర్ట్స్ సైన్స్, పోషకాహారం, గాయాల నివారణపై నిపుణులు అవగాహన కల్పించారు. క్రీడలలో ప్రతిభను మెరుగుపరచేందుకు ఇటువంటి అవగాహన సదస్సులు ఎంతో ఉపయోగపడతాయని, రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ పలు వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తోందని అధికారులు స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...