Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం

Follow Udayam on Google
సందీప్ Jul 12, 2026 11:12 AM నిర్మల్ General
నిర్మల్‌లో అర్ధరాత్రి దొంగల బీభత్సం - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యనగర్‌లో ఉన్న తన్వి అపార్ట్‌మెంట్‌లో శుక్రవారం అర్ధరాత్రి 2:30 గంటల సమయంలో అపార్ట్‌మెంట్ లోని 303 నంబర్ ఫ్లాట్ తలుపు ధ్వంసం చేసి లోనికి వెళ్లిన దొంగలు ఇంట్లోని అల్మారాలు, కబోర్డులను గాలించినా విలువైన వస్తువులు లభించలేదు. అనంతరం 207 నంబర్ ఫ్లాట్‌లోకి ప్రవేశించి, ఇంట్లో ఉన్న వారిని కత్తులతో బెదిరించి సుమారు 20 తులాల వెండి, 2 తులాల బంగారు ఆభరణాలు దోచుకెళ్లారు.సమాచారం అందుకున్న వెంటనే డీఎస్పీ శ్రీనివాస్, పట్టణ సీఐ సమ్మయ్య సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Comments

G
Loading comments...