వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లా కేంద్రంలోని గుల్జార్ మార్కెట్‌లో కొనసాగుతున్న ఎస్‌ఐఆర్ ప్రక్రియను శనివారం జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కిషోర్ కుమార్ పరిశీలించారు. ఎన్యూమరేషన్ ఫారాల స్వీకరణ, డిజిటలైజేషన్ తదితర కార్యక్రమాల పురోగతిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఇంటింటికి వెళ్లి ప్రతి కుటుంబం నుంచి ఎన్యూమరేషన్ ఫారాలను తప్పనిసరిగా స్వీకరించాలన్నారు. ఈ పరిశీలనలో అర్బన్ తహసీల్దార్ రాజు, కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ రఫ్ఫూ తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

