వార్తలకు తిరిగి వెళ్లండి

పిల్లల ఆరోగ్య పరిరక్షణలో భాగంగా జూలై 13న నిర్వహించే జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని కడ్తాల్ గ్రామ సర్పంచ్ గుర్రం రాము పిలుపునిచ్చారు. ఒకటి నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. నులిపురుగుల నివారణతో పిల్లల ఆరోగ్యం మెరుగుపడి, రక్తహీనత తగ్గి, శారీరక–మానసిక ఎదుగుదలకు దోహదపడుతుందని పేర్కొన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా ఆల్బెండజోల్ మాత్ర వేయించాలని సూచించారు.
Comments
Loading comments...

