వార్తలకు తిరిగి వెళ్లండి

దుబాయ్‌లోని ఎమిరేట్స్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఏడుగురు భారతీయ కార్మికులు దుర్మరణం పాలయ్యారు. మరో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడ్డారు. సాంకేతిక లోపం కారణంగా రోడ్డుపై ఆగి ఉన్న ట్రక్కును.. కార్మికులతో వెళ్తున్న మినీ బస్సు అతివేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.
గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు, ఈ విషాద ఘటనను దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించినట్లు సమాచారం.
Comments
Loading comments...

