Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి: డీజీపీ సీవీ ఆనంద్

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Jun 29, 2026 6:34 PM హైదరాబాద్General
నిబద్ధతతో ప్రజలకు సేవ చేయాలి: డీజీపీ సీవీ ఆనంద్ - Udayam
పదోన్నతి పొందిన డీఎస్పీలు నిజాయితీ, క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని డీజీపీ సీవీ ఆనంద్ సూచించారు. పదోన్నతి అంటే కేవలం హోదా పెరగడం కాదని, అంతకుమించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహించే అవకాశం అని ఆయన గుర్తు చేశారు. ప్రజల సమస్యలను చట్టబద్ధంగా, పారదర్శకంగా పరిష్కరిస్తూ పోలీసు శాఖపై నమ్మకాన్ని పెంచాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రత్యేక శ్రద్ధ చూపి, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా అంకితభావంతో పనిచేయాలని ఆయన స్పష్టం చేశారు.

Comments

G
Loading comments...