Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 9న జన్నారం బందుకు పిలుపు

Follow Udayam on Google
p.g.murthy Sep 06, 2026 4:18 PM మంచిర్యాలGeneral
సెప్టెంబర్ 9న జన్నారం బందుకు పిలుపు - Udayam
టైగర్ జోన్ ను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ సెప్టెంబర్ 9న జన్నారం మండల బందుకు పిలుపునిస్తున్నామని సామాజిక పోరాట సమితి కన్వీనర్ భూమాచారి వెల్లడించారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ టైగర్ జోన్, అటవీ ఆంక్షలు ఎత్తివేయాలని 2 వారాలుగా రిలే నిరాహార దీక్ష చేస్తున్న ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెప్టెంబర్ 9న బందుకు పిలుపునిస్తున్నామని అందరూ సహకరించాలని కోరారు.

Comments

G
Loading comments...